మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Veda Vyasa Stuti – శ్రీ వేదవ్యాస స్తుతిః
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 1
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 2
కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతమ్ |
వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిమ్ || 3
వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణమ్ |
శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహమ్ || 4
అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః |
అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః || 5
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణమ్ |
సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః || 6
బ్రహ్మసూత్రకృతే తస్మై వేదవ్యాసాయ వేధసే |
జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతో హరేః || 7
వ్యాసః సమస్తధర్మాణాం వక్తా మునివరేడితః |
చిరంజీవీ దీర్ఘమాయుర్దదాతు జటిలో మమ || 8
ప్రజ్ఞాబలేన తపసా చతుర్వేదవిభాజకః |
కృష్ణద్వైపాయనో యశ్చ తస్మై శ్రీగురవే నమః || 9
జటాధరస్తపోనిష్ఠః శుద్ధయోగో జితేంద్రియః |
కృష్ణాజినధరః కృష్ణస్తస్మై శ్రీగురవే నమః || 10
భారతస్య విధాతా చ ద్వితీయ ఇవ యో హరిః |
హరిభక్తిపరో యశ్చ తస్మై శ్రీగురవే నమః || 11
జయతి పరాశరసూనుః సత్యవతీ హృదయనందనో వ్యాసః |
యస్యాస్య కమలగలితం భారతమమృతం జగత్పిబతి || 12
వేదవిభాగవిధాత్రే విమలాయ బ్రహ్మణే నమో విశ్వదృశే |
సకలధృతిహేతుసాధనసూత్రసృజే సత్యవత్యభివ్యక్తి మతే || 13
వేదాంతవాక్యకుసుమాని సమాని చారు
జగ్రంథ సూత్రనిచయేన మనోహరేణ |
మోక్షార్థిలోకహితకామనయా మునిర్యః
తం బాదరాయణమహం ప్రణమామి భక్త్యా || 14
ఇతి శ్రీ వేదవ్యాస స్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.